కారేపల్లి, మే 06 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చిలుముల రాములు గత కొంతకాలంగా డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. కూలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న రాములుకు నలుగురు కుమార్తెలు. కుటుంబ పెద్ద అనారోగ్యానికి గురికావడంతో ఇల్లు గడవడం కష్టతరంగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ఉద్దీన్ మంగళవారం రాములు వైద్య ఖర్చులకు రూ.5 వేలు అందజేశాడు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డొంకెన రవీందర్ గౌడ్, వార్డు మాజీ సభ్యుడు ఎండి.ఖలీల్ ఉల్లా ఖాన్, తాళ్లూరి కోటి, భూక్య చందునాయక్, ఎల్లబ్బాయి, వెంకటి పాల్గొన్నారు.