పరీక్షలు ముగిశాయోచ్..!
విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన పరీక్షలు బుధవారం జరిగిన రసాయనశాస్త్రం-2బీ సమాప్తమయ్యా యి.
- ముగిసిన ఇంటర్మీయట్ ఎగ్జామ్స్
- పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల కేరింతలు
- ఆనందోత్సాహాలతో ఇంటికి పయనం
- సందడిగా బస్టాండ్లు,ప్రధాన కూడళ్లు
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 29: విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన పరీక్షలు బుధవారం జరిగిన రసాయనశాస్త్రం-2బీ సమాప్తమయ్యా యి. ఇన్ని రోజులూ పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్ష రాసిన అనంతరం రెక్కలు వచ్చిన పక్షుల్లా కేరింతలతో సందడి చేశారు. చివరి పరీక్ష రాసి కేంద్రాల్లో నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు ఆకాశాన్ని జయించినంత ఆనందంగా కన్పించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నా రు. తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లు, రూమ్ ల్లో ఉండి చదువుకున్న విద్యార్థులు ఈ పరీక్షలు ముగియగానే ఇంటి బాట పట్టారు. ఇం టర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని, ప్రథమ సంవత్సర పరీక్షల్లో నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారని డీఐఈవో రవిబాబు తెలిపారు. బుధవారం జరిగిన పరీక్షల్లో 14,508 మంది విద్యార్థులకు గాను 494 మంది గైర్హాజరయ్యారని, 14,014 మంది హాజరయ్యారని వివరించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

