కారేపల్లి, అక్టోబర్ 07 : ఆదివాసీలపై నిర్భంధాలు, వివక్షతపై మరో పోరాటానికి సమాయత్తం కావాలని తుడుందెబ్బ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బచ్చల వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కొమురం భీమ్ 85వ వర్ధంతిని కారేపల్లిలో నిర్వహించారు. కారేపల్లి కొమురం భీమ్ సెంటర్లోని విగ్రహానికి, తుడుందెబ్బ కార్యాలయంలో కొమురం భీమ్ చిత్రపటానికి ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ.. అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసీలపై నిర్భంధాలు విధిస్తుండడంతో వారి అస్తిత్వానికి ప్రమాదం వచ్చిందన్నారు.
రాజకీయ పక్షాలు ఓట్ల రాజకీయంతో ఆదివాసీలపై వివక్షత సాగిస్తున్నారని, దీనిపై కొమురం భీమ్ స్ఫూర్తితో ఐక్య పోరాటాలతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్తీ రాంప్రసాద్, కార్యదర్శి ఈసాల రాంబాబు, మాజీ సర్పంచులు కుర్సం సత్యనారాయణ, సాగబోయిన వెంకటమ్మ, తుడుం దెబ్బ మండల నాయకులు యదళ్లపల్లి శీను, తాటి రామారావు, దారం సహదేవులు, ఈసాల లక్ష్మి పాల్గొన్నారు.