– మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాధ బాబు
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 04 : సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మక్కా కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి మార్కెట్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పి.అనిత, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి టి.దయాకర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం మక్కా పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైనందున అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రైవేటు వ్యాపారులకు పంటను అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని పంటను అమ్ముకోవాలని సూచించారు. తద్వారా ఆశించిన ధర పొందటానికి అవకాశం ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రానికి పంటను తీసుకువచ్చే రైతులు నాణ్యమైన పంటను తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మార్క్ఫెడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మేనేజర్ సునీత, డి సి ఓ గంగాధర్, డీసీఎంఎస్ మేనేజర్ సందీప్, డీఎంఓ అలీమ్, మార్కెట్ కమిటీ సెక్రటరీ పి.వీరాంజనేయులు, సొసైటీ సీఈఓ అలీ, కౌన్సిలర్లు కృష్ణకుమారి, శ్రీజ, రంగారావు పాల్గొన్నారు.

‘మక్కా కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి’