మధిర, మార్చి 17 : జిల్లా సెంట్రల్ బ్యాంక్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ సీఈఓ ఆదిత్యనాథ్ అన్నారు. సోమవారం చింతకాని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా బ్రాంచ్ ఏర్పాటుకు కావలసిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చింతకానిలో త్వరలోనే బ్రాంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంత రైతులకు వ్యవసాయ రుణాలు, ఎల్టి లోన్లు, బంగారు తాకట్టు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సహకార సంఘ అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ రుణాలన్ని సెంట్రల్ బ్యాంక్ ద్వారా సహకార సంఘాలకు అందజేయడం జరుగుతుందన్నారు. సెంట్రల్ బ్యాంక్ కల్పించే బ్యాంకు సౌకర్యాలను సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం, బ్రాంచ్ మేనేజర్ చైతన్య, సూపర్వైజర్ నాగేశ్వరరావు, చింతకాని సహకార సంఘం చైర్మన్ కొండపల్లి శేఖర్ రెడ్డి, డైరెక్టర్లు కిలారి మనోహర్ బాబు, నన్నక కోటయ్య, వలమల రామారావు, సీఈఓ మారగాని శ్రీనివాసరావు, సహకార సంఘ సిబ్బంది పాల్గొన్నారు.