– మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు
ఎర్రుపాలెం, జూన్ 03 : వ్యవసాయ భూముల సారాన్ని పెంపొందించడంతో పాటు పంటల దిగుబడులను మెరుగుపరిచే పచ్చిరొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెం సహకార సంఘంలో బుధవారం సొసైటీ చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న జీలుగు (పచ్చిరొట్ట) విత్తనాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చిరొట్ట పంటలను సాగు చేసి భూమిలో కలియదున్నడం వల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూసారం గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు. ఫలితంగా రసాయనిక ఎరువుల వినియోగం తగ్గి, సాగు ఖర్చులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన భూములను అందించాలంటే రైతులు పచ్చిరొట్ట పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, సర్పంచులు బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి, గురిజాల మరియమ్మ, ముక్కర రామకృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరెడ్డి, మాజీ ఏఎంసి చైర్మన్ చావా రామకృష్ణ, పీసీసీ సభ్యుడు శీలం ప్రతాపరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్లు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, కోగంటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ దోమందుల నాగేశ్వరావు, మాజీ ఎంపీటీసీ దోమందుల సామేలు, నాయకులు శీలం శ్రీనివాసరెడ్డి, అనుమోలు కృష్ణారావు, శీలం వెంకట్రామిరెడ్డి, కర్నాటి రామకోటారెడ్డి, కర్నాటి సుధాకర్ రెడ్డి, కోగంటి నాగేశ్వరావు, నున్నా మోహనరావు, కన్నా శ్రీనివాసరావు, దేవరకొండ రాజీవ్ గాంధీ, షేక్ జాన్ బాషా, పురుషోత్తం, బూసిపల్లి తిరుమలరెడ్డి, సీఈఓలు బొగ్గుల శివారెడ్డి, మోహన్ రావు, ఏఈఓ వంశీకృష్ణ, కుంపటి శ్రీనివాసరావు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.