మధిర, ఏప్రిల్ 23 : భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో తెలంగాణ భూ భారతి, భూమి హక్కుల చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్వే చేసి భూముల సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిరంతర ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
త్వరలో కోర్టులు కూడా వస్తున్నాయని, తక్కువ సమయంలో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. సాదా బైనామాలలో ఉన్న భూములు కూడా సర్వే జరిపి క్రమబద్దీకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, ఆర్డీఓ నరసింహారావు, తాసీల్దార్ రాంబాబు, ఏడిఏ విజయ్ చంద్ర, ఏఓ సాయిదీక్ష, కమిషనర్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.