వైరాటౌన్, ఏప్రిల్ 11 : ఊరూరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గొల్లెనపాడు గ్రామంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ మక్కల కొనుగోళ్ల కోసం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పంట చేతికొస్తున్న క్రమంలో కేంద్రాలు లేకపోవడంతో క్వింటాకు రూ.1,600 లకు తక్కువ ధరకు బయట అమ్ముకొని నష్టపోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే మక్కలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు మండలానికి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.