Julurupadu Agriculture Market | జూలూరుపాడు, మార్చి 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ను శాశ్వత మార్కెట్‌గా ఏర్పాటు చేసి వెంటనే పనులను ప్రారంభించాలని గిరిజన, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గిరిజన, రైతు సంఘాల నాయకుల సమావేశం ఇవాళ ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలో అధిక శాతం మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నారని, ప్రధానంగా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిని సాగుచేస్తున్నారని తెలిపారు. జూలూరుపాడు పత్తి మార్కెట్‌కు ప్రతీరోజూ వందలాది క్వింటాళ్ల కొద్దీ పత్తి వస్తుందని.. జూలూరుపాడు, పాల్వంచ, చంద్రుగొండ, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, సుజాత నగర్,ఏన్కూర్, టేకులపల్లి లాంటి సూదురా ప్రాంతాల నుండి రైతులు పత్తిని తీసుకొచ్చి అమ్ముకోవడం జరుగుతుందన్నారు.
ఈ మార్కెట్ ఏర్పాటుతో రైతులకు అన్ని రకాలుగా ఉపయోగం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఈ మార్కెట్లో వందల మంది హమాలీ కూలీలు, చదువుకున్న నిరుద్యోగ యువతకు గుమస్తాలుగా ఉపాధి దొరుకుతుందన్నారు. రైతులకు పంటలు అమ్ముకున్న తరువాత నగదు రూపంలో, డబ్బులను తీసుకోని వెళుతున్నారని దూర ప్రాంతాలకు వెళ్ళాలి అంటే వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉన్నదని దీని వల్ల ఖర్చు లు పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు.
రైతులకు అన్ని రకాలుగా ఉపయోగ కరంగా ఉన్న ఈ మార్కెట్‌ను వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి పనులు వెంటనే ప్రారంభం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘ ఏఐయుకేఎస్ రాష్ట్ర నాయకులు బానోత్ దర్మ నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ వైరా నియోజకవర్గ ఇంచార్జ్ లకావత్ నాగేశ్వరావు, జిల్లా అధ్యక్షులు కేశవ్ నాయక్, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మధు, జూలూరు పాడు మండల అధ్యక్షులు భూక్యా రవి నాయక్, ఉపాధ్యక్షుడు శివ నాయక్, ఆదివాసీ నాయకుడు ఇర్పా రాకేష్, బొర్రా భాగ్య రాజు, ఉపేందర్ రావు, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
Current Wires | ఇంటిపై విద్యుత్ తీగలు.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?