మణుగూరు రూరల్, ఫిబ్రవరి 27: టీఆర్ఎఎస్పై అస్యత ఆరోపణలు, ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. మణుగూరు పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో ఆదివారం పార్టీ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు మట్టపల్లి సాగర్ అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత మున్ముందు ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. లక్ష్య సాధన కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో.. జిల్లాలో.. ఎలాంటి గ్రూఫులూ లేవన్నారు. ఉన్నది ఒక్క టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఉన్నది ఒకే గ్రూప్ అది కేసీఆర్ గ్రూప్ అని అన్నారు. కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల వేదికపై టీఆర్ఎస్పై బురదజల్లే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారి అసత్య ప్రచారాలను టీఆర్ఎస్ నాయకులు తిప్పికొట్టాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, వార్డుల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించాలన్నారు. నియోజకవర్గంలో 10,500 దళిత కుటుంబాలు ఉన్నాయని, ఏడేళ్లలో దళితులందరికీ దళిత బంధు పథకం వర్తించేలా బాధ్యత తీసుకుంటానన్నారు. మార్చిలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎన్.రాజు, నాయకులు హర్షనాయుడు, బోశెట్టి రవిప్రసాద్, రుద్రవెంకట్, గొగ్గుల రామకృష్ణ, కొమరం శ్రీను, గోనెల నాని, లక్ష్మీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఎక్కువ మంది టీఆర్ఎస్లో చేరుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం అశ్వాపురం మండలానికి చెందిన 200 కుటుంబాలు ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుమ్మల చెరువు, రామవరం, భీమవరం నుంచి ఎంపీటీసీ తాటి పూజిత, కోరం రామారావు ఆధ్వర్యంలో 80 కుటుంబాలు, అశ్వాపురం టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గద్దల రామకృష్ణ ఆధ్వర్యంలో అశ్వాపురం నుంచి 40 కుటుంబాలు, అనుశక్తినగర్ నుంచి 40 కుటుంబాలతో పాటు మరికొన్ని కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, పార్టీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్‌కుమార్, వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం, నాయకులు మొగిళ్ల వీరారెడ్డి, లంకెల రమేశ్, ఎట్టి పుష్ప తదితరులు పాల్గొన్నారు.