బోనకల్లు, మే 06 : ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో స్థానిక ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నందు శరత్ మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మధిర జనసేన పార్టీ నాయకుడు తాళ్లూరి డేవిడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఎంతోమంది పేదలకు సరిగ్గా చూపు లేని వారికి, సరైన చూపును అందించాలనే ఉద్దేశంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ఐదు మండలాల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి స్వామి, కాంపాటి బుజ్జి, ఇండ్ల యోహాను, ఇండ్ల బుల్లి, ఇరుగు రాములు, గుర్రం వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, డాక్టర్ దేవేందర్ కండె, టెక్నీషియన్ శ్రీను, భాష, జనసేన పార్టీ ముదిగొండ మండల నాయకుడు అనుమూల నరేశ్, మండల కో ఆర్డినేటర్ జొన్నలగడ్డ భద్ర, విద్యార్థి విభాగ నాయకుడు గంధం ఆనంద్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.