మధిర, జూలై 31 : సమాజంలో ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని మధిర సివిల్ జడ్జి ప్రశాంతి అన్నారు. గురువారం పట్టణంలో మధిర జిలుగుమాడులో ఆదరణ సేవా ఫౌండేషన్‌లో వృద్ధులు, అనాథల ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. న్యాయ సేవాధికారా సంస్థ పారా లీగల్ వాలంటీర్లు, హ్యూమన్ రైట్స్ వాలంటీర్ల సమక్షంలో ప్రముఖ సామాజిక సేవకుడు, మధిర ఆశ మిత్ర లంకా కొండయ్య ప్రజా అవగాహన నిమిత్తం ఏర్పాటు చేసిన స్టాప్ ఎయిడ్స్-టాక్ ఎయిడ్స్ బులిటెన్‌ను జడ్జి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వాలంటీర్ హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి సంపూర్ణంగా తెలుసుకుని ప్రతి ఒక్కరు ఎయిడ్స్ గురించి తెలుసుకునేలా అవగాహన కలిగించాలన్నారు. ఎయిడ్స్ నిర్మూలనకు లంకా కొండయ్య చేస్తున్న కృషి అభినందనీయం అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంపీడీఓ మాధవరపు నాగేశ్వర్రావు, ఆధారణ ఫౌండేషన్ నిర్వహుకురాలు కృష్ణ వేణి, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కార్యకర్తలు కోట వెంకట్, కె.వెంకటేశ్వర్లు, పారా లీగల్ వాలంటీర్లు దోర్నాల సుజాత, యశోధ, ఖమ్మం పారా లీగల్ సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.