ఖమ్మం రూరల్, మే 11 : నేటి నుండి ప్రారంభమైన జనగణన ప్రక్రియలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి పౌరుడు తమ పేరు పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత కోరారు. జనగణన ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు రెడ్డిపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి చైర్ పర్సన్ హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జన గణనలో పాల్గొనాలన్నారు. ఇంటి వద్దకు వచ్చే ఎన్యుమరేటర్కు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను తెలపాల్సి ఉంటుందన్నారు.
వందకు వంద శాతం 100కు జన గణన ప్రక్రియ జరిగితే భవిష్యత్లో ఖచ్చితమైన గణాంకాలు తేలుతాయన్నారు. ఇంట్లో ప్రతి ఒక్కరి వివరాలు నమోదు కావాల్సి ఉంటుందని, 32 వార్డులలో ఇందుకు సంబంధించి వివిధ అంచెలుగా సిబ్బంది, అధికారులను ప్రభుత్వం నియామకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మారెమ్మ తల్లి గుడి చైర్మన్ వీరారెడ్డి, స్థానిక కౌన్సిలర్ రవీందర్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సతీష్, జన గణన నమోదు ప్రక్రియకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.