ఖమ్మం, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం రియల్ రంగంలో దూసుకెళ్తున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. దీంతో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతున్నది. ఓ వైపు వెంచర్లలో ఖాళీ స్థలాలు, మరోవైపు అపార్ట్మెంట్లలో నివాసగృహాలు, వ్యక్తిగత గృహ సముదాయాల నిర్మాణం జోరుగా కొనసాగుతున్నది. దశాబ్దకాలంలో ఖమ్మం నగరం నలుదిశలా విస్తరించింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి తోడు స్థిరాస్తి రంగం వృద్ధి చెందడంతో అనేకచోట్ల భూములకు డిమాండ్ పెరిగింది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో స్థిరాస్తుల విక్రయాలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులు కస్టమర్ల నమ్మకాలకు అనుగుణంగా అన్నిరకాల అనుమతులతో వెంచర్లను సిద్ధం చేసి విక్రయాలు చేపడుతున్నారు.
ఖమ్మం రియల్ రంగం అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఉన్నది. నగరానికి చుట్టుపక్కలా అభివృద్ధి విస్తరిస్తుండటంతో ఎటుచూసినా రియల్ ఎస్టేట్ వెంచర్లు దర్శనమిస్తున్నాయి. శరవేగంగా పెరుగుతున్న నగరంలో రియల్ వ్యాపారానికి భారీగానే డిమాండ్ ఉన్నది. నగర శివార్లతోపాటు సుడా పరిధిలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వెంచర్ల వైపు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో వెంచర్లు మా ప్రత్యేకత
పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటి స్థలాన్ని చేరువ చేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. అభివృద్ది చెందుతున్న ప్రాంతాల్లో వెంచర్లు చేయడం ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాం. ఈ క్రమంలో గత 13ళ్లుగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మా వెంచర్లు చేస్తున్నాం. ఫాం ల్యాండ్, డీటీసీపీ లే అవుట్స్, రిసార్ట్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ వంటి నాలుగు వేరియంట్లలో వెంచర్లు చేస్తున్నాం.
-ఆవుల సైదేశ్వరరావు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏఎస్ఆర్ వృక్షం డెవలపర్స్
హైదరాబాద్ నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు..
సన్‌రైజ్ ఇన్ఫ్రాలో హైదరాబాద్ నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సూర్యాపేట సమీపంలో మేం చేసిన వెంచర్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. సూర్యాపేట దినదినాభివృద్ధి చెందుతుండడంతో అక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. మా వద్ద కొనుగోలు చేసిన కస్టమర్ల ప్లాట్లకు ధరలు విపరీతంగా పెరిగాయి. రెండింతల లాభం చేకూరుతుంది.
-వట్టే రాకేశ్, సన్‌రైజ్ ఇన్ఫ్రా
ఆదరణ బాగుంది
కొన్నేళ్లుగా ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు హైదరాబాద్ పరిధి కొండాపూర్‌లో వెంచర్లు వేస్తున్నాం. మేం చేసిన వెంచర్లకు కస్టమర్ల నుంచి ఆదరణ బాగుంది. ప్రస్తుతం కోర్టు ఎదురుగా, ఖమ్మం నగరం విజయనగర్‌కాలనీలో డీటీసీపీ అప్రూవల్తో ప్లాట్లు విక్రయిస్తున్నాం. కోర్టు ఎదురుగా గేటెడ్ కమ్యునిటీ నిర్మాణాలతో ముందుకెళ్తున్నాం.
-కాంపాటి పిచ్చయ్య, శ్రీమహా విష్ణు ఎన్‌ఫ్రా ఎల్ఎల్పీ, డైరెక్టర్
నమ్మకానికి అనుగుణంగా ప్లాట్ల విక్రయాలు..
కొనుగోలు దారుల నమ్మకానికి అనుగుణంగా మా సంస్థలో చేసిన వెంచర్లలో ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నాం. డీటీసీపీ అనుమతులు పొందడంతో కస్టమర్లు ప్లాట్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కస్టమర్లు పెట్టిన పెట్టుబడితో భరోసా కల్పిస్తున్నాం. కొత్త కలెక్టరేట్, గుర్రాలపాడు, ఇల్లెందురోడ్డు, రఘునాథపాలెం మండలాల్లో వెంచర్లు వేశాం. మా వెంచర్ల ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగి కస్టమర్లు కొనుగోలు చేసిన ప్లాట్లకు లాభాలు చేకూరాయి.
– గాలి రాంబాబు, మేనేజింగ్ డైరెక్టర్, జీఆర్ రియల్ ఎస్టేట్స్