పాల్వంచ, నవంబర్ 14 : ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 104 కేజీల గంజాయిని ఖమ్మం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టణంలోని ఇందిరాకాలనీ జీసీసీ కార్యాలయం వద్ద మాటు వేసి గురువారం రాత్రి పట్టుకున్నారు.
బెంగళూరు సోమనహళ్లికి చెందిన దిలీప్‌కుమార్, కట్టా హర్షిత్, మల్కాన్గిరికి చెందిన సంజీవ్ మండల్, సునీల్ రేలు కారులో గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు జాతీయ రహదారిపై అధికారులు పట్టుకున్నారు. కారుతోపాటు ఒక స్పోర్ట్స్ బైక్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని పాల్వంచ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాడిలో ఖమ్మం ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, సీఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.