మధిర, నవంబర్ 07: చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట (Polam Bata) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ నంబూరి రామారావు మాట్లాడుతూ… రైతులు కెపాసిటర్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. తద్వారా విద్యుత్తును పొదుపు చేయడంతో పాటు హై వోల్టేజ్, లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని తెలిపారు. రైతులకు విద్యుత్ సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ లైన్ల కింద ఎత్తుగా ఉండే చెట్లను పెంచడం వల్ల గాలి, దుమారాలు వచ్చినప్పుడు తోటి రైతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈలు ఉమామహేశ్వరి, చావా శ్రీధర్, సబ్ ఇంజినీర్ సందీప్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ సుధా శ్రీనివాసరావు, విద్యుత్ సిబ్బంది రమేష్ బాబు, కిషోర్, రైతులు అంబటి శాంతయ్య, అంబటి వెంకటి, అనగాని మంగయ్య, నెల్లూరి రమేష్, అనేగాని ఎల్లయ్య, గింజుపల్లి బాలకృష్ణ, కందిమల్ల రామారావు, నెల్లూరి సీతారామయ్య, బైరు వెంకటేశ్వర్లు, కూచిపూడి రామారావు, అనగాని సైదులు, కందిమల్ల రవి, కందిమల్ల వెంకటి, కందిమల్ల లక్ష్మణ్, పెంటయ్య, మంద స్వామి, మంద బుజ్జి, మంద సాంబ,అనగాని రామయ్య, అనగాని కళ్యాణ్, కట్ట భరత్ తదితరులు పాల్గొన్నారు.