కారేపల్లి, సెప్టెంబర్ 15 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల ఎలక్ట్రీషియన్లు, మోటార్ మెకానిక్ ల నూతన కమిటీని సోమవారం ప్రకటించారు. సింగరేణి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ నూతన మండల కమిటీ అధ్యక్షుడిగా భోగిళ్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా షేక్ ఖాజావలి, కార్యదర్శిగా కేతమల్ల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా కుమ్మరి నవ కిషోర్, కోశాధికారిగా వేములపల్లి కృష్ణ ప్రసాద్, ప్రచార కార్యదర్శులుగా కె.పృథ్వీరాజ్, షేక్ మజీద్ పాషా, యాకూబ్ పాషా, సలహాదారులుగా బొందల వెంకటేశ్వర్లు, భూక్య హుస్సేన్, పిట్టల నాగరాజు, ఎస్కే.మీరా ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనున్నట్టు తెలిపారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు, మోటార్ సైకిల్ మెకానిక్ల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకై తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన ఎలక్ట్రీషియన్లు, మోటార్ సైకిల్ మెకానిక్లు పాల్గొన్నారు.