కారేపల్లి, మార్చి 21 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయంలో అమ్మవారి పవిత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర్యంలో కొత్తగూడెంనకు చెందిన కృష్ణ యజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ కొడమంచిలి పణి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రాతకాల మండప పూజలు, అమ్మవారికి నవ కలశ స్థపనము, జల బిందెల అభిషేకము, మహిళల సామూహిక కుంకుమార్చన, వేద పారాయణ,మహావిద్యా పారాయణ, పవిత్రంగా హోమములు, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి, శ్రీ మహా త్రిపుర సుందరి బ్రహ్మవిద్య మంత్ర హోమం వంటి పూజలు జరిపారు.

కోటమైసమ్మ దేవాలయంలో ఏకాదశ రుద్రాభిషేక పూజలు
మణుగూరుకు చెందిన సామాజికవేత్త జక్కుల రామకోటేశ్వరరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ జక్కుల శంకర్రావు, జక్కుల వెంకటగిరి, కృష్ణారావు బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాలలో కోటమైసమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, కార్యనిర్వాహణాధికారి కె.వేణుగోపాలచార్యులు, దేవాదాయ శాఖ అధికారులు పగడాల మోహన్ కృష్ణ, పర్స సాయి, అన్న ప్రసాద కార్యక్రమ నిర్వహణ కన్వీనర్ తాటిపల్లి సుబ్బారావు, ఏలుగురు మధు బాబు, సైఫా రాజశేఖర్, గందె సురేశ్, చందా చక్రధర్, నూక ఆనందరావు, అర్వపల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.

కోటమైసమ్మ దేవాలయంలో ఏకాదశ రుద్రాభిషేక పూజలు