కారేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉపాధ్యాయ సమస్యల పట్ల తక్షణమే స్పందించాలని టీఎస్ యూటీఎఫ్(UTF) జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ ( Shiak Ranjan) డిమాండ్ చేశారు. ఆదివారం సింగరేణి మండల యూటీఎఫ్ 12వ మహాసభ ఖమ్మం ( Khammam ) లో జరిగింది.
ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన షేక్ రంజాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ,ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీ కమిటీ వేసిందని, ఆ రిపోర్టును వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఊరించటం తప్ప చేతలలో చూపడం లేదని ఆరోపించారు.
పెండింగ్ లో ఉన్న ఐదు విడతల కరువు భత్యం ఉందని దానిని ప్రకటించకుండా తాత్సర్యం చేస్తున్నారన్నారు. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ బిల్లులు, ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ జీపీఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్స్, బిల్లులు, టీఎస్జిఎల్ఐ, సరెండర్ బిల్లులు ,మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఎఫ్.ఎఫ్. డబ్ల్యూ ప్రధాన కార్యదర్శి జీవీ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ చనిపోయిన 48 మంది సభ్యులకు కుటుంబాలకు యూటీఎఫ్ ప్రారంభించిన కుటుంబ సంక్షేమ పథకం ద్వారా రూ. 6 లక్షలు చొప్పున రూ. 3 కోట్ల ఇచ్చి సామాజిక బాధ్యతలో భాగం అయిందన్నారు. ఈ మహాసభ లో సంఘం జిల్లా కార్యదర్శులు బానోత్ రాందాస్, ధర్మసోత్ నాగేశ్వరావు, ఆడిట్ కమిటీ కన్వీనర్ సుధాకర్, వట్టికొండ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బండి కృష్ణా రావు, ఎం.నరసింహారావు టీ. శేషయ్య , బీ. శంకర్, భీమా, బహదూర్ లాల్, ఎం. బాలు, తులసిదాస్, రమాదేవి, శ్రీలత, హబీబాబేగం సోఫియా బేగం, రజలీ పాషా, బాలస్వామి, చిన్నారాములు, కృష్ణా పాల్గొన్నారు.
యూటీఎఫ్ మండల కమిటీ ఎన్నిక..

సింగరేణి మండల యూటీఎఫ్ నూతన కమిటీని మండల మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కేవీ కృష్ణా రావు, ప్రధాన కార్యదర్శిగా బానోత్ మంగీలాల్, ఉపాధ్యక్షులుగా ఆర్. నాగలక్ష్మి, బీ. సూర్య, కోశాధికారి ఎటుకూరి నాగేశ్వరరావు, ఆడిటర్ దార రాంబాబు, ఏప్.ఎఫ్. డబ్ల్యూ మండల కన్వీనర్ గా మద్దినేని నాగేశ్వరరావును ఎన్నుకున్నారు.
కార్యదర్శులు గా పీ. రామారావు, ఎన్. శివకోటి, జీ. సంతులాల్, .ఏ. సుజాత, కృషజ్యోతి, కే. నరేంద్ర, ఎస్. పవన్ కళ్యాణ్, బీ. బాలకృష్ణ, డీ. కిరణ్, అకడమీక్ కమిటీ కన్వీనర్ గా డీ. ఈర్యను ఎన్నుకున్నారు. మహిళ కన్వీనర్‌గా బీ. సునీత, క్రీడా కన్వీనర్ శ్రీరాములు, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ మత్తోజ్ సోమయ్య చారి, సోషల్ మీడియా కన్వీనర్ గా బానోత్ మురళీ లతో పాటు కాంప్లెక్స్ లకు కన్వీనర్, కో కన్వీనర్లను ఎన్నుకున్నట్లు నాయకులు వెల్లడించారు.