‘ఓటర్ల చైతన్యం – ఎన్నికల్లో భాగస్వామ్యం’ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో వారికి అన్ని సౌకర్యాలూ కల్పించింది.
పోలింగ్ కేంద్రాలను కూడా ప్రత్యేకంగా అలంకరించింది. పోలింగ్ స్టేషన్ల ముందు భాగాన అరటి మొక్కలతో స్వాగత తోరణాలను ఏర్పాటుచేసింది. శామియానాలు, క్లాత్ కర్టెన్లు, పచ్చని తివాచీలతో సుందరంగా తీర్చిదిద్దింది. పోలింగ్ కేంద్రాల లోపలి భాగాలను కూడా ఆహ్లాదంగా రూపుదిద్దింది. ఇవన్నీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 12