ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్చీల్లో ఆదివారం క్రీస్తు పునరుత్థానం సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్లు, పాస్టర్లు క్రీస్తు సందేశాలను వివరించారు. క్రీస్తు మార్గాన్ని ప్రతిఒక్కరూ అనుసరించాలన్నారు. పలు చర్చీల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రార్థనలు చేశారు.
ప్రత్యేక ప్రార్థనలతో ఉమ్మడి జిల్లాలోని చర్చీలు ఆదివారం కిటకిటలాడాయి.. ఈస్టర్ సందర్భంగా ఉదయాన్నే క్రైస్తవ మందిరాలకు చేరుకున్నారు.. చర్చిల్లో ఫాదర్లు, బిషప్లు, దైవ సందేశకులు క్రీస్తు సందేశాన్నిచ్చారు.. ఆయన మార్గాన్ని అనుసరించాలన్నారు. లోకం కోసమే క్రీస్తు ఎనలేని త్యాగాలు చేశారన్నారు. ప్రార్థనలతో గ్రామాలు, పట్టణాల్లోని చర్చిలు సందడిగా కనిపించాయి.