భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 14 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. సరిగ్గా 2:30 గంటలకు స్వల్పంగా భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్‌పై 3.8 నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.
రాజమండ్రి ప్రాంతం నుంచి వాయువ్యంగా 111 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. గతంలో కూడా ఇంతకంటే ఎక్కువసేపు భూమి కంపించిన సందర్భం ఉంది. అర్ధరాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలకు పెద్దగా తెలియలేదు. అయితే గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఇలాంటి భూ ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉండడంతో జనం భయపడుతున్నారు.