చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు నిర్వహించే పండుగ దసరా. మన తెలంగాణలో ఇదే అతిపెద్ద పండుగ. ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ పండుగను శనివారం ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక పూజలకు ఖమ్మం స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, పారువేటకు జమ్మిబండ ముస్తాబయ్యాయి. నిర్వాహకులు ఆలయంతోపాటు జమ్మిబండను విద్యుద్ధీపాలతో అలంకరించారు.