రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదా వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, చర్ల, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, చండ్రుగొండ, భద్రాచలం మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అశ్వారావుపేటలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మొండివైఖరి వీడి నిరుద్యోగ అభ్యర్థుల అభ్యర్థనను పట్టించుకోవాలని, డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను పెంచాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కావాలనే పరీక్షలను వెంటవెంటనే జరిపించేందుకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగుల పోరాటానికి సంఘీభావంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్, నాయకులు సత్యవరపు సంపూర్ణ, నారం రాజశేఖర్, భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మానె రామకృష్ణ, ఆకోజు సునీల్‌కుమార్, గాజుబోయిన ఏసు, యార్లగడ్డ శ్రీను, పానుగంటి లోకేశ్, సంకుబాపన అనుదీప్, బొమ్మిడి శ్రీకాంత్‌యాదవ్, ముత్యాల రాజేశ్, కొట్టి వెంకటేశ్వర్లు, కోరెం చంద్రశేఖర్, తాడూరి రజాక్, చిప్పనపల్లి బజారయ్య తదితరులు పాల్గొన్నారు.
-నమస్తే నెట్వర్క్