వైరా టౌన్, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీ నేతల కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ప్రజాసంక్షేమం కోసం పనిచేసే బీఆర్ఎస్ను ఎన్నికల్లో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్‌లాల్ పిలుపునిచ్చారు. వైరా మండలంలోని పాలడుగుకు చెందిన సుమారు 40 కుటుంబాలు సోమవారం స్థానిక నాయకుడు పఠాన్ కరీముల్లా ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరాయి. పార్టీలో చేరిన వారికి మదన్‌లాల్ గులాబీ కండువాలు కప్పి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోకు ఆకర్షితులై ఎక్కువ మంది గులాబీ పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో వైరా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పసుపులేటి మోహన్‌రావు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, వర్తక సంఘం అధ్యక్షుడు, కౌన్సిలర్ వనమా విశ్వేశ్వరరావు, ముఖ్యనేతలు కృష్ణమూర్తి, కాపా మురళీకృష్ణ, బానోతు సక్కుభాయి, మేడూరి రామారావు, కొత్తా వెంకటేశ్వరరావు, మాదినేని దుర్గాప్రసాద్, మాచర్ల ఆదినారాయణ, బట్టా భద్రయ్య, సాదం రామారావు, మిట్టపల్లి సత్యంబాబు, ఇరుపార్శపు భాస్కర్‌రావు, కామినేని శ్రీనివాసరావు, శెట్టిపల్లి శ్రీనివాసరావు, గుజ్జర్లపూడి దేవరాజు, ఏదునూరి శ్రీను, మరికంటి శివ, నల్లబోలు వెంకటరెడ్డి, నూకల వాసు, యండ్రాతి గోపాలరావు, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, మెండెం కృష్ణంరాజు, ఇలారపు వాసు, నందిగామ మనోహర్, తడికమళ్ల నాగేశ్వరరావు, వేల్పుల మురళి తదితరులు పాల్గొన్నారు.
వైరా పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాదినేని రాము సోమవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. త్వరలో తన అనుచరులూ బీఆర్ఎస్లో చేరతారని మాదినేని ప్రకటించారు.