ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 24 : ఆపద వచ్చిందని, ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని అధైర్య పడొద్దని, బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి భరోసానిచ్చారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ ప్రెసిడెంట్ బెల్లం వేణుగోపాల్, మాజీ జడ్పీటీసీ ఎండపల్లి ప్రసాద్, పార్టీ నాయకులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన జలగం నగర్ పొన్నెకల్ కొండాపురం ఎం.వెంకటయ్యపాలెం, ఏదులాపురం, గూడూరు పాడు, మంగళగూడెం, పోలేపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలు, సానుభూతిపరులు, బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. మృతి చెందిన వ్యక్తుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కందాల మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా లేకపోయినా పాలేరు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, అన్ని విధాల ఆదుకుంటానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మీ కష్టసుఖాలలో తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పేరం వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ దుర్గయ్య, సొసైటీ చైర్మన్ జరుపుల లక్ష్మణ్ నాయక్, బానోతు కృష్ణ, బానోత్ మోహన్, గడ్డ వీరన్న, అక్కినపల్లి వెంకన్న, మేకల ఉదయ్, రెడ్యానాయక్, మురళి, మేకల నాగేశ్వరరావు, మైబిల్లి సాహెబ్, వెంపటి ఉపేందర్, మట్టా వెంకటేశ్వరరావు, బాలు నాయక్, ముత్యం కృష్ణారావుతో పాటు ఆయా గ్రామాల తాజీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
Khammam Rural : అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం : మాజీ ఎమ్మెల్యే కందాల