ఖమ్మం రూరల్, ఏప్రిల్ 22 : రక్తదానం ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయొచ్చని, మనమిచ్చే రక్తం ఆపదలో ఉన్న వేరొకరి ప్రాణాలను కాపాడుతుందని డీఎంహెచ్ఓ కళావతిబాయి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు సమీపంలో గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 104 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం మెడికల్ కళాశాల సంచాలకులు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రక్తదానం వేరొకరి జీవితంలో వెలుగు నిలుపుతుందన్నారు. కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ కళాశాలలో ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ.. రక్తదాన శిబిరంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం వారికి సమాజంపై ఉన్న బాధ్యతను తెలియజేస్తుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళి కృష్ణ మాట్లాడుతూ ఇప్పటికి వరసుగా 11 సార్లు రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. రక్తదానం చేసిన విద్యార్థులు, అధ్యాపకులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీవిద్య, డిఐఓ చందు నాయక్, పాథాలజి ప్రొఫెసర్ జోత్స్న, కళాశాల డీన్ డాక్టర్ సుదర్శన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్, డిప్లొమా ఇన్చార్జి కృష్ణ ప్రసాద్, ఏఓ వైశాలి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ శ్రీకుమార్, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ చిరంజీవి, డాక్టర్ హరిప్రసాద్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రహీం, విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Khammam : రక్తదానం వేరొకరికి ప్రాణదానం : డీఎంహెచ్ఓ కళావతిబాయి