మధిర, జూన్ 18 : జాతి వైరం మరిచిన కుక్క, కోతి స్నేహం అందరిని ఆకట్టుకుంటుంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో కోతి, కుక్క స్నేహంగా ఉంటూ కలిసి మెలిసి తిరుగుతున్నాయి. ఈ సన్నివేశాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఖమ్మం-బోనకల్లు రోడ్లో గల జగన్నాథపురం గ్రామంలో పెంపుడు కుక్క మీద కోతి పడుకుంటే కుక్క మోసుకుంటూ రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ రెండు జంతువుల మధ్య జాతి వైరం ఉన్నప్పటికీ స్నేహంగా కలిసి మెలిసి తిరుగుతున్నాయి.