భద్రాచలం, ఫిబ్రవరి16: పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెలలో జరుగనున్న పాలక మండలి సమావేశంలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని, సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు. పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన యూనిట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
సమావేశానికి పలువురు మంత్రులతో పాటు ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ కలెక్టర్లు, వివిధశాఖల అధికారులు హాజరవుతారన్నారు. ప్రభుత్వ అధికారులు వారి శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, ఎస్వో సురేశ్‌బాబు, జీసీసీ డీఎం విజయ్‌కుమార్, ఏవో భీం, డీటీ ఆర్వోఎఫ్ఆర్ శ్రీనివాస్, ఏడీ అగ్రికల్చర్ భాస్కర్ పాల్గొన్నారు.