జిల్లాకు 240 మంది స్టాఫ్ నర్సులు
వైద్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులు ఎట్టకేలకు భర్తీ కానున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రాత పరీక్ష నిర్వహించిన విషయం విదితమే.
- కౌన్సెలింగ్ ద్వారా విధుల కేటాయింపు
- నర్సులకు ఐడీ కార్డులు అందజేసిన డీఎంహెచ్వో
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : వైద్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులు ఎట్టకేలకు భర్తీ కానున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రాత పరీక్ష నిర్వహించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం పరీక్ష ఫలితాలు విడుదల చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో అధికారికంగా వెలువడిన ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 240 మందిని ఎంపిక చేశారు. వారికి అక్కడే నియామక పత్రాలను అందజేయగా.. స్థానిక డీఎంహెచ్వో డాక్టర్ శిరీష జిల్లా కార్యాలయంలో ఐడీ కార్డులను వారికి అందజేశారు.
కౌన్సెలింగ్ ద్వారా విధుల కేటాయింపు
కొత్తగా ఏర్పాటైన జిల్లాలో గతంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏరియా ఆస్పత్రి ఉండేది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో ఏజెన్సీ ప్రాంతానికి తొలిసారిగా మెడికల్ కాలేజీ మంజూరుతోపాటు నర్సింగ్ కళాశాల కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏరియా ఆస్పత్రి జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయ్యింది. దీనికి అనుసంధానంగా వంద పడకల మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి బీజం పడింది. అయితే ఇందులో ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ కూడా రావడంతోపాటు పోస్టుల భర్తీకి రాత పరీక్ష కూడా నిర్వహించారు. వాటి ఫలితాలు వెలువడడంతో జిల్లాలో ప్రస్తుతం 240 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ కానున్నాయి. మరో వారం రోజుల్లో కౌన్సిలింగ్ పూర్తి కాగానే కొత్తగా ఆర్డర్లు తీసుకున్న స్టాఫ్ నర్స్లు జిల్లా ఏరియా, జనరల్ ఆస్పత్రిలో విధుల్లో చేరనున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

