కారేపల్లి, మార్చి 24 : వంద రోజుల ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ ప్రచారంలో భాగంగా క్షయవ్యాధి నిర్ధారణ (NAAT Testing)లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఖమ్మం జిల్లా నుండి ‘బెస్ట్ డిస్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ను చీమలపాడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఎంఎల్ఎచ్పీ గా విధులు నిర్వహిస్తున్న చెట్టిపోగు కళ్యాణి అందుకుంది. జిల్లా కేంద్రంలోని డిటిసి కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుమాధవ్, జిల్లా టీబీ నివారణ అధికారి సుబ్బారావు చేతుల మీదుగా ఆమెకు అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేశారు. ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న కళ్యాణిని మండల వైద్యాధికారులు సురేశ్, శ్రేష్ఠ సాఫల్య, రత్న మనోహర్, హెల్త్ సూపర్వైజర్లు, తోటి సిబ్బంది అభినందించారు.