బోనకల్లు, ఏప్రిల్ 01 : ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల, చిన్నబీరవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చౌక ధరల దుకాణాల ద్వారా మంగళవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తాసీల్దార్ అనిశెట్టి పుర్ణచందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా చేసిందన్నారు. మండలంలోని 26 రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. ప్రతి లబ్ధిదారుడు రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు మైథిలి, నవీన్ డీలర్లు అచ్చయ్య, బాలరాజు పాల్గొన్నారు.