కారేపల్లి, అక్టోబర్ 06 : కారేపల్లి మండలం మాణిక్యారంకు చెందిన ప్రముఖ వేద పండితుడు పంతంగి మాధవశర్మ ఇటివల కాలం చేశారు. ఆయన కుటుంబానికి మాణిక్యారంకు చెందిన తుళ్లూరి పురుషోత్తం, వీరభద్రం, భారతిరాణి 75 కేజీల బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను సోమవారం మాధవశర్మ కుమారుడు రాఘవశర్మకు అందజేశారు. ఈ సందర్భంగా మాధవశర్మ సేవలను గ్రామస్తులు కొనియాడారు. వేదాలు తెలిసిన వ్యక్తిగా ఎలాంటి గర్వం లేకుండా అందరిని ఆదరించే మాధవశర్మ వృద్దాప్య రుగ్మతలతో మృతి చెందారు.