మధిర, మార్చి 26 : ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య చికిత్స పొందిన పేదలకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్) చెక్కులు మంజూరయ్యాయి. బుధవారం ఖమ్మం నగరంలోని గట్టయ్యసెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మధిర నియోజకవర్గానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ. 5.25 లక్షల విలువ గల చెక్కులను కాంగ్రెస్ జిల్లా నాయకుడు కొప్పుల చంద్రశేఖర్, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇమామ్ భాయ్, ఓబీసీ కార్పొరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హారికా నాయుడు, నాయకులు స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, కన్నెబోయిన సీతారామయ్య, ఖమ్మం పాటి రమేష్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.