కారేపల్లి, డిసెంబర్ 23 : కారేపల్లి మండల పరిధిలోని మాదారంలో గల యేసు ప్రార్థన మందిరంలో మంగళవారం క్రైస్తవ పేద వితంతువులకు దుస్తులు పంపిణీ చేశారు. హైదరాబాద్కు చెందిన రాజు పుత్ర-అరుణ దంపతుల వితరణగా క్రైస్తవుల పవిత్ర పండుగ అయిన క్రిస్మస్ ను పురస్కరించుకుని చర్చి పాస్టర్ తన్నీరు పురుషోత్తం చౌదరి చేతుల మీదుగా పలువురు వితంతువులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాస్టర్ పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ.. పేదలకు సహాయం, సేవా చేయడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి చెందుతారన్నారు. క్రీస్తు బోధనలతో పాటు ఆయన చూపించిన ప్రేమ, దయ, ఐకమత్యం శ్యామల సందేశాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసిసి రాష్ట్ర నాయకులు తన్నీరు మధుసూదన్ రావు, కరుణ, శ్రీలత పాల్గొన్నారు.

Karepally : మాదారంలో పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ