ఖమ్మం రూరల్, ఆగస్టు 28 : ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ ఓటరు జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ప్రదర్శించారు. ఖమ్మం రూరల్ మండలంలో ఏదులాపురం మున్సిపాలిటీ విభజన అనంతరం 21 పంచాయతీలుగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పంచాయతీల పరిధిలో మొత్తం 35,796 మంది ఓటర్లు ఉండగా వారిలో మహిళా ఓటర్లు 18,640 మంది కాగా, పురుష ఓటర్లు 17,154 మంది ఉన్నారు. మరో ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు.
అత్యధికంగా ఎం వెంకటయ్య పాలెం గ్రామ పంచాయతీలో 3,746 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా దారేడు పంచాయతీలో 709 మంది ఓటర్లు ఉన్నారు. శుక్రవారం జిల్లా స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 30న మండలంలో మండల స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం అనంతరం వారి నుంచి అభ్యంతరాల సేకరణ తర్వాత ఓటరు తుది జాబితా ఖారారు కానుంది.
Khammam Rural : పంచాయతీ కార్యాలయాల్లో ఓటర్ జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రదర్శన