చర్ల, మే 26 : అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో నిరుపేదలు చర్ల మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు కొండా చరణ్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నా.. వారికి ఇందిరమ్మ కమిటీలు అన్యాయం చేశాయని ఆరోపించారు.
తమకు అనుకూలంగా ఉన్న వారికి, ధనవంతులకు ఇండ్లు మంజూరు చేస్తూ.. నిరుపేదలకు మొండిచేయి చూపారన్నారు. మొదటి విడతలో మంజూరు కాని వారికి రెండో విడతలో అంటూ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి కొండా కౌశిక్, ప్రవీణ్, మోహన్, పంబికుమారి, శాంత, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.