Errupalem | ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయాన్నే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి సర్వాంగాభిషేకం నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులందరికి అన్నదానం చేశారు.
స్వామి వారి నిత్య అన్నదానానికి హైదరాబాద్ వాసి నర్సింగోజు షాహంక్- కావ్య దంపతులు రూ.1,00,016 విరాళం అందజేశారు. వారికి దేవస్థానం తరపున శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పర్యవేక్షకులు కే విజయ కుమారి, అర్చకులు మురళీ మోహన శర్మ, రాజీవ్ శర్మ, రామకృష్ణ శాస్త్రి, సుదర్శన శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.