భద్రాచలం, అక్టోబర్ 1 : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు శ్రీమహాలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి మహిళా భక్తులు, వైదిక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే చిత్రకూట మండపంలో శ్రీరామాయణ పారాయణం చేశారు. కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో కె.దామోదర్‌రావు, ఏఈవో శ్రావణ్‌కుమార్, ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.