ఏన్కూరు: విద్యార్థులకు చదవడం, రాయడం కోసం ఈ నెల 27 నుంచి నవంబర్ 27 వరకు జరిగే బేసిక్ త్రీఆర్స్ ప్రోగ్రాం ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని రాయమాదారం, ఎర్రబోడుతండా, తిమ్మారావుపేట ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా త్రీఆర్స్ ప్రోగ్రాం అమలుతీరు, బ్లీస్లైన్ టెస్ట్, మధ్యాహ్న భోజన వివరాలు, పాఠశాల రికార్డులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులర్గా క్లాసులు జరిగే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీ.వీ.శర్మ, ఉపాధ్యాయులు ఉంగరాల వెంకటేశ్వర్లు, శేషు, స్వర్ణకుమారి, రాయమాదారం పాఠశాల ఉపాధ్యాయులు సోమ్లానాయక్, అలివేలు, నాగేశ్వరరావు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.