మధిర, మార్చి 25 : ఖమ్మం జిల్లా మధిర మండలంలోని దెందుకూరు గ్రామ వాసి పగిడిపల్లి వెంకటేశ్వర్లుకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. వెంకటేశ్వర్లు ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జాషువా సాహిత్య వేదిక ఖమ్మం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం నందు ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో డాక్టర్ సీతారాం సాహిత్యం- ఒక అధ్యయనం అనే అంశంపై చేసిన పరిశోధనకు ఆయనకు డాక్టరేట్ లభించింది. డాక్టరేట్ పొందడం పట్ల దెందుకూరు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.