వేంసూరు : రైతు పండించిన ప్రతి గింజను సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కందుకూరు సొసైటీ ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం కందుకూరు సొసైటీ పరిధిలోని వెంకటాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు ఆందోళన చెందొద్దని, తప్పకుండా ప్రతి గింజను కొంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్ పాలా వెంకటరెడ్డి, సీఈఓ సూర్యప్రకాశ్ రెడ్డి, ఏఈఓ రైతులు తదితరులు పాల్గొన్నారు.