ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 31 : సొసైటీల సభ్యులకు బీమా చేయించేందుకు బీమా సంస్థల ఎంపిక అత్యంత పారదర్శంగా జరిగిందని డీసీసీబీ సీఈవో అబ్దుల్ ఉర్ రెహమాన్ తెలిపారు. శనివారం డీసీసీబీలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2024 ఆగస్టు నెలతో ఫాలసీ వ్యవధి ముగుస్తున్నందున సొసైటీల నుంచి రైతుల జాబితా తెప్పించడం జరిగిందన్నారు. తక్కువ కోడ్ చేసిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కో రైతుకు రూ.646తో ముందుకు రావడంతో వారికి అవకాశం కల్పించామన్నారు. ఈ నిర్ణయం బీమా కంపెనీలు, బ్యాంకు అధికారుల సమక్షంలోనే జరిగిందన్నారు. ఉద్యోగ బదిలీల ప్రక్రియలో సైతం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియ పూర్తి చేశామన్నారు.