పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం.. దమ్మైగూడెంలో కాలిపోయిన ఈత చెట్లు
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని దమ్మైగూడెంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ నిర్లక్ష్యం వల్ల గీత కార్మికులకు జీవనాధారమైన ఈత చెట్లు కాలిపోయాయి. దమ్మాయిగూడెం ఊర చెరువు పక్క కాల్వలో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు..
తిరుమలయపాలెం, మే 23 : ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని దమ్మైగూడెంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ నిర్లక్ష్యం వల్ల గీత కార్మికులకు జీవనాధారమైన ఈత చెట్లు కాలిపోయాయి. దమ్మాయిగూడెం ఊర చెరువు పక్క కాల్వలో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు కంప కట్టెలను కూలీలతో తొలగించకుండా పంచాయతీ కార్యదర్శి నిప్పు పెట్టించాడు. చెత్తా చెదారానికి అంటించిన అగ్ని వ్యాప్తి చెంది చెరువుగట్టుపై ఉన్న ఈత చెట్లన్నీ కాలిపోయాయి. దీంతో ఉపాధి హామీ పనుల పేరుతో మంట పెట్టి మా జీవనాధారాన్ని మంటలో కలిపేశారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు తగలబడుతుంటే వాటిని రక్షించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదని వారు మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈత చెట్లు కాలిపోయేందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గీత కార్మికులు కోరారు.

పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం.. దమ్మైగూడెంలో కాలిపోయిన ఈత చెట్లు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

