ఇల్లెందు : పట్టణంలో విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న డైలీ వేజ్ వర్కర్ ఒకరు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. బుధవారం ఇల్లెందు (Illendu మున్సిపాలిటీ పరిధి ఏడో వార్డులో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తున్న మర్రిగూడెం చెందిన యువకుడు కుంచ ఉదయ్ ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభంపైకి ఎక్కాడు.
అక్కడ విద్యుత్ఘాతానికి (Electric Shock) గురై అక్కడి నుంచి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది 108 వాహనంలో ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.