బోనకల్లు, ఆగస్టు 15 : తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, చెరువులు, మున్నేరులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. బోనకల్లు మండలంలోని పెద్ద బీరవల్లి గ్రామ సమీపంలో గల పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో పంట పొలాలు నీట మునిగాయి. ఈ వాగుకు కొనిజర్ల, చింతకాని మండలాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద చేరుకోవడంతో వాగు సమీపంలో గల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. చెరువుల కింద నాట్లు వేసిన వరి పొలాలు పూర్తిగా వరద నీటితో మునిగిపోయాయి. అదేవిధంగా పత్తి, ఆయిల్‌పామ్ తోటల్లో వరద నీరు ప్రవహించి పంట భూముల్లో నీళ్లు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి.
Bonakal : పెద్ద బీరవల్లిలో నీట మునిగిన పంట పొలాలు