కారేపల్లి, మే 26 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో పంతులునాయక్ తండాలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను తొడిదలగూడెం మాజీ సర్పంచ్ బానోతు కుమార్, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ఆటలు ఆడడం వల్ల శారీరక, మానసిక ధృఢత్వం కలుగుతుందన్నారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. ప్రశాంత వాతావరణంలో పోటీలు కొనసాగేలా అంతా సహకరించాలన్నారు. అనంతరం ఇరు జట్ల క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు తేజావత్ రాంజీ నాయక్, కేలోత్ కోటేశ్, థామస్, శ్రీనివాస్, గణేశ్, చందు, శ్యామ్, సిద్దు పాల్గొన్నారు.