కమాన్‌బజార్, ఏప్రిల్ 15 : సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి పోటు రంగారావుపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టిన దోశద్రోహం కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్, జీ రామయ్య డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఖమ్మం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధినేతలైన అమిత్‌షా, మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులపై అకారణంగా కేసులు బనాయిస్తున్నారన్నారు. వీటిని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర నాయకులు సీవై పుల్లయ్య, సీహెచ్ శిరోమణి, శివలింగం, వెంకయ్య, లాల్మియా, నాగేశ్వరరావు, మలీదు నాగేశ్వరరావు, ఝాన్సీ, శ్రీనివాసరావు, శోభ పాల్గొన్నారు.