కారేపల్లి, మే 09 : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులను ఆశ్రయించారు. మండల పరిధిలోని రేగులగూడెం గ్రామానికి చెందిన ఆవుల కృష్ణసాగర్, కీర్తి ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందడంతో పాటు దగ్గరి బంధువులు కూడా. అయితే అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమ వివాహానికి నిరాకరించారు. దీంతో వారిద్దరు వయస్సు రీత్యా మేజర్లు కావడంతో గుడిలో పెళ్లి చేసుకుని తమకు ప్రాణం హానీ ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ కారేపల్లి పోలీసులను ఆశ్రయించారు. కారేపల్లి పోలీసులు ఇరువైపులా పెద్దలకు సమాచారం అందించి స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.