దిగుబడి లేక దిగాలు.. కొనుగోళ్లు బేజారు..
భద్రాద్రి జిల్లాలో అసలే ఈ ఏడాది అధిక వర్షాలు కురిశాయి. పత్తి రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదు. అయినప్పటికీ విపత్తులను తట్టుకొని కొద్దోగొప్పో పత్తి పంట రైతుల చేతికొచ్చింది. దానిని తీసుకొని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకుందామని వెళ్లిన రైతులకు సీసీఐ నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి.
- తేమ శాతాన్ని కొలిచే కొత్త యాప్‌తో రైతన్నల పరేషాన్
- సీసీఐలో కొత్త నిబంధనలతో దూది రైతుల ఆందోళన
- ‘భద్రాద్రి’లో ఇప్పటి వరకు 43,710 క్వింటాలే కొనుగోళ్లు
- ‘ప్రైవేటు’లోనే విక్రయం.. సీసీఐ వద్ద దళారులదే రాజ్యం
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలో అసలే ఈ ఏడాది అధిక వర్షాలు కురిశాయి. పత్తి రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదు. అయినప్పటికీ విపత్తులను తట్టుకొని కొద్దోగొప్పో పత్తి పంట రైతుల చేతికొచ్చింది. దానిని తీసుకొని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకుందామని వెళ్లిన రైతులకు సీసీఐ నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే దిగుబడులు అమాంతం తగ్గి దిగాలు పడుతున్న రైతులు..కొనుగోళ్ల వద్ద సీసీఐ నిబంధనలు చూసి బేజారవుతున్నారు. మరోవైపు దళారుల రాజ్యంలో వేగలేక చివరికి ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు.
భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది 2,20,842 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. వర్షాలు, వరదలు, తుపాన్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో రైతుల అంచనాలు తారుమారయ్యాయి. దీనికి తోడు ప్రభుత్వం కిసాన్ కపాస్ యాప్ ద్వారానే విక్రయించాలని నిబంధన పెట్టడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వివరాలు యాప్‌లో అప్లోడ్ చేయడం, స్లాట్ బుక్ చేసుకోవడం వంటివి రైతులకు ఇబ్బందికరంగా మారడంతో సామాన్య రైతులందరూ సీసీఐలో విక్రయించేందుకు వెనుకంజ వేస్తున్నారు.
తేమ శాతంతో తిప్పలు..
తేమ శాతం పేరుతో రైతులను సీసీఐ అధికారులు పెడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ సీజన్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి తేమ ఎక్కువగానే ఉంది. సీసీఐలో విక్రయించడానికి 8 నుంచి 12 శాతం మాత్రమే తేమ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే సీసీఐ అధికారులు ఆ పత్తిని కొనుగోలు చేయరు. తేమ తగ్గాక తిరిగి పత్తిని విక్రయించడానికి మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈలోపు పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లినా, వారు దానిని అక్కడ తిరస్కరించినా రైతులు మళ్లీ ఖర్చులన్నీ భరించి పత్తిని ఇంటికి తెచ్చుకొని ఆరబెట్టుకోవాలి. ఈ ఇబ్బందులన్నీ పడలేని రైతులు.. ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు. సీసీఐ అధికారులు తిరస్కరించిన పత్తిని అటునుంచి అటే ప్రైవేటు వ్యాపారుల వద్దకు తీసుకెళ్తున్నారు. అయితే, సీసీఐ గిట్టుబాటు ధర రూ.8,100గా ఉన్నప్పటికీ తేమ శాతంలో హెచ్చుతగ్గులను బట్టి కనిష్టంగా రూ.7 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు.
ప్రైవేటు కౌంటర్ల వద్దనే విక్రయాలు..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా నాలుగు చోట్ల సీసీఐ కేంద్రాలున్నాయి. ప్రైవేటు కేంద్రాలైతే మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకున్నారు. ఇవి కూడా అత్యధికంగా సుజాతనగర్, జూలూరుపాడు, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ మండలాల్లో ఉన్నాయి. సీసీఐ నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులు తమ ప్రాంతంలో ఉండే ప్రైవేటు వ్యాపారులు ఏర్పాటుచేసుకున్న ప్రైవేటు చిల్లర కౌంటర్ల వద్ద విక్రయించుకుంటున్నారు. ఇదే పత్తిని దళారులు దర్జాగా సీసీఐ కేంద్రంలో విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేటు కౌంటర్ల వద్ద కొందరు దళారులు రైతుల వద్ద క్వింటాకు రూ.5,500 నుంచి రూ.6,000 మధ్య ధరను వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 26 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు సీసీఐ మాత్రం నాలుగు కేంద్రాల్లో 43,710 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.
రెండెకరాల్లో పత్తి వేస్తే ఎకరం పోయింది..
నేను రెండెకరాల్లో పత్తి పంట వేశాను. వర్షాల వల్ల ఎకరం పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. కొద్దోగొప్పో చేతికొచ్చిన పంటను గిట్టుబాటు ధరకు విక్రయించుకుందామని సీసీఐ కేంద్రానికి తీసుకెళ్తే అక్కడి అధికారులు నిబంధనలతో చుక్కలు చూపించారు. తేమ పేరుతో తిరకాసు పెట్టారు. యాప్ ద్వారానే విక్రయించాలని చెప్పారు. యాప్ గురించి నాకు తెలియదు. మరోవైపు కూలీలు దొరకక కొంత పత్తిని కూడా తియ్యలేదు. తీసిన దానిని బయటే అమ్మేస్తా. ఎకరానికి 40 వేలు ఖర్చు అయింది. కనీసం పెట్టుబడి కూడా రాలేదు.
-జీ.ఐలయ్య, రైతు, డేగలమడుగు
ఏటా దళారులదే రాజ్యం..
కొంతమంది షావుకార్లు రైతులకు పెట్టుబడి పెట్టి వారు సీసీఐలో అమ్ముకోకుండా చేస్తున్నారు. మరికొంత మంది సీసీఐ అధికారులు విధిస్తున్న నిబంధనలను తట్టుకోలేక బయట వ్యాపారులకు పత్తి పంటను అమ్ముకుంటున్నారు. సీజన్ ఎట్లా ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. తేమ శాతం ఎక్కువగా ఉన్నా అభ్యంతరం లేకుండా ప్రభుత్వమే తీసుకోవాలి.
-సత్తి నాగేశ్వరరావు, రేపల్లెవాడ, చండ్రుగొండ
యాప్ గురించి ఏఈవోలకు ట్రైనింగ్ ఇచ్చాం..
కిసాన్ కపాస్ యాప్ వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు ఏఈవోలకు శిక్షణ ఇచ్చాం. తేమ శాతం ఎక్కువగా ఉంటే సీసీఐ అధికారులు పత్తిని తీసుకోరు. వర్షాల సమయంలో తేమ ఉంది. కానీ ఇప్పడు తేమ శాతం లేదు. కొనుగోళ్లు బాగానే జరుగుతున్నాయి. వర్షాల వల్ల దిగుబడి తగ్గిపోయింది. రైతులు తమ అవసరాలను బట్టి బయట విక్రయించుకుంటున్నారు.
-నరేంద్ర, జిల్లా మార్కెటింగ్ అధికారి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

